చిరంజీవి 150 సినిమా కంటే ముందు దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సినిమా తెరకెక్కించనున్నారు. నితిన్ హీరోగా ఆయన సినిమా తీయనున్నారు. చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ఆయన పుట్టినరోజు ఆగస్టు 22న ప్రారంభించనున్నారు. ఈలోపు నితిన్ తో సినిమా తీయాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
స్క్రిప్ట్ ఇప్పటికే ఒకే చేశారని, జూన్ 9న షూటింగ్ ప్రారంభించే అవకాశముందని తెలిపాయి. 50 రోజుల్లోపు షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నితిన్ సరసన కొత్త హీరోయిన్ నటించే అవకాశముంది. పూరి జగన్నాథ్ సొంత బేనర్ లో ఈ సినిమాను నిర్మించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన 'హార్ట్ ఎటాక్' విజయవంతమైంది. తాజాగా ఛార్మి ప్రధానపాత్రలో 'జ్యోతిలక్ష్మి' పేరుతో ఆయన సినిమా తెరకెక్కించారు.
కాగా, 'ఆటోజానీ'లో పలు కీలక సన్నివేశాలు మార్చాలని చిరంజీవి సూచించడంతో పూరి జగన్నాథ్ రీవర్క్ చేస్తున్నారని చిత్రపురి సమాచారం. దాదాపు 20 సీన్లు వరకు మారుస్తున్నారని తెలుస్తోంది.

No comments:
Post a Comment