'చిరంజీవితో సినిమా తీయడానికి సిద్ధం'

మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయటానికి సిద్ధంగా ఉన్నానని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. మంగళవారం  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు.
 
చిరంజీవి 150వ చిత్రం తరువాత ఆయనతో కలిసి సినిమా చేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ సమాధానమిస్తూ... "భలేవాడివే..ఎందుకు చేయను?! తప్పకుండా చేస్తాను" అని చెప్పారు. ప్రస్తుతం మూడు పెద్ద సినిమాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి,  నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకున్న ప్రతిసారీ తెలియని కొత్త శక్తి లభిస్తుందని గణేష్ సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల నుంచి వెళ్లిన అనంతరం మంచి విజయాలు లభిస్తాయని చెప్పారు. తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్టు  తెలిపారు. 

No comments:

Post a Comment