'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల ‪ ‎Cheekati Raajyam‬ (Telugu Version) Posters

విలక్షణ నటుడు కమల్ హాసన్ కొత్త సినిమా 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోసర్లు విడుదలైయ్యాయి. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష్, ప్రకాశ్ రాజ్, దర్శకుడు రాజేశ్ యం. సెల్వ తదితరులు హాజరయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

త్రిష, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో 'తూంగా వనం' టైటిట్ ఖరారు చేశారు. ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కమల్ భార్యగా ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించే అవకాశముంది. జీబ్రాన్ సంగీతం అందించనున్నాడు. కమల్ హాసన్ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించడం ఇది నాలుగోసారి.





No comments:

Post a Comment