ప్రభాస్ పై మోహన్ బాబు అలిగారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై మంచు మోహన్ బాబు అలిగారట.  పెళ్లికి ఆలస్యంగా రావటంతో పాటు కుటుంబ సభ్యులను తీసుకు రాలేదని ఆయన కొద్దిసేపు ప్రభాస్ పై అలక వహించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రభాస్, మోహన్ బాబును గట్టిగా హత్తుకుని, గెడ్డం పట్టుకుని బతిమాలి.. నూతన వధూవరుల దగ్గరకు అలాగే వెళ్లారు.

అనంతరం పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని అక్షింతలు వేసి ఆశీర్వదించాలని మోహన్ బాబు కోరగా వద్దులే ఎందుకు కలిసి ఫొటోలు దిగుదామంటూ... ఫొటోలు తీయించుకున్నారు. అయినా కూడా మోహన్ బాబు ఊరుకోకుండా కొత్త దంపతులతో ప్రభాస్ కాళ్లకు దండం పెట్టించి, అక్షింతలు వేయించారు. ఇక ఛత్రపతి సినిమాలో కాట్రాజుగా చేసిన సుప్రీత్ కూడా ప్రభాస్ తో కలిసి సందడి చేశారు. అలాగే లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యానిర్వాణతో ప్రభాస్ ముచ్చట్లు పెట్టాడు. ఈ సందర్భంగా ప్రభాస్ తో పలువురు ఫొటోలు దిగారు. ఇక తమిళ హీరో సూర్య, హీరో రాజశేఖర్, జమున, తదితరులు విచ్చేశారు.

మరోవైపు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, మాజీ మంత్రి డీకే అరుణ విచ్చేసి మనోజ్, ప్రణతి దంపతులను ఆశీర్వదించారు.



No comments:

Post a Comment