మనోజ్ పెళ్లికి మహేష్, నమ్రత..

 ప్రిన్స్ మహేష్ బాబు సతీసమేతంగా మంచు మనోజ్ వివాహానికి హాజరయ్యాడు. నూతన వధూవరులు మనోజ్-ప్రణతిలను మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ఆశీర్వదించారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలారామన్ విచ్చేసి మనోజ్, ప్రణతిలను దీవించారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు... మహేష్ బాబును గవర్నర్ నరసింహన్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండేకు పరిచయం చేశారు. అలాగే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, దైవజ్ఞశర్మ, దర్శక, నిర్మాత రవిరాజా పినిశెట్టి, ఆది,సినీ రచయిత బీవీఎస్ రవి, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మహారాష్ట్ర గవర్నర్  సీహెచ్ విద్యాసాగర్ రావు, హాస్యనటుడు అలీ, కాంగ్రెస్ నేత దానం నాగేందర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి తదితరులు ఈ పెళ్లికి హాజరయ్యారు.


No comments:

Post a Comment