మనోజ్ పెళ్లికి ఎవరెవరు వచ్చారంటే..

మంచు మనోజ్ వివాహ వేడుకకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. మాదాపూర్ హైటెక్స్ లో  మనోజ్-ప్రణతిల వివాహం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులైన మనోజ్-ప్రణతిలను ప్రముఖులు ఆశీర్వదించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి, సుశీల్ కుమార్ షిండే, ఈనాడు చైర్మన్ రామోజీరావు, దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి విచ్చిస్తే నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఇక ప్రముఖ హీరో బాలకృష్ణ, బ్రహ్మానందం, రాజా రవీంద్ర, రాఘవేంద్రరావు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత దర్శకుడు ఇళయరాజా, జయసుధ, కోటా శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, గిరిబాబు, కాట్రగడ్డ మురారీ, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, శ్యాం ప్రసాద్ రెడ్డి, గుణ్ణం గంగరాజు, ఎస్వీ కృష్ణారెడ్డి, సునీల్, కొండేటి సురేష్, సుమలత, తనికెళ్ల భరణి, శివ బాలాజీ, మధుమిత, అశోక్ బాబు, హాస్యనటుడు వేణుమాధవ్, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, అలనాటి హీరోయిన్ గీతాంజలి తదితరులు హాజరయ్యారు.


No comments:

Post a Comment