Mahesh Babu New Movie Title change - 'శ్రీమంతుడు' కంటే 'మగాడు' బాగుంటుంది!

యువ హీరో మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు' చిత్రం టైటిల్ ను మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం పేరును మార్చాలని కోరినట్టు టాలీవుడ్ వర్గాల కథనం.

డిస్ట్రిబ్యూటర్లు ఇటీవల సమావేశమై ఈ చిత్రం బిజినెస్ గురించి చర్చించారు. శ్రీమంతుడు పేరు మాస్ వర్గాలకు దగ్గర ఉండదని వారు అభిప్రాయపడ్డారు. స్టార్ హీరో చిత్రానికి టైటిల్ ముఖ్యమని, ఇది బిజినెస్ పై ప్రభావం చూపుతుందని చెప్పారు.  శ్రీమంతుడు బదులు 'మగాడు' అన్న టైటిల్ బాగుంటుందని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతకు చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రానికి మగాడు అన్న టైటిల్ ను తొలుత పరిశీలించారని, ఆ తర్వాత శ్రీమంతుడుగా మార్చారని టాలీవుడ్  వర్గాలు తెలిపాయి. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.



No comments:

Post a Comment