అరుంధతి చిత్రంలో జేజమ్మగా జేజేలు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా
గూడుకట్టుకున్న నటి అనుష్క. అంతకు ముందు వరకూ గ్లామర్ డాల్‌గా గుర్తింపు
పొందిన ఈ యోగా సుందరిని జేజమ్మ పాత్ర చాలా మార్పును తీసుకొచ్చింది. అంతగా
గుర్తింపు తెచ్చిపెట్టిన ఆ పాత్ర తరువాత చాలెంజింగ్ పాత్రలనా, చారిత్రక
పాత్రలనా అనుష్కనే పోషించాలన్నంతగా ప్రాచుర్యం పొందారు. అలాగే ఇప్పుడు
కాకతీయ సామ్రాజ్య చరిత్రకు ఘన కీర్తిని, ఖ్యాతిని ఆర్జించి పెట్టిన
రుద్రమదేవిగా వెండితెరపై తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
త్వరలో విడుదల కానున్న ఈచిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ద్విభాషా చిత్రం జీరోసైజ్‌లో నటిస్తున్న అనుష్క సినీ వయసు దశాబ్దకాలం.ఇది పరువ వయసు. వయసొచ్చిన ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు కుంపటి మీద కూర్చునట్లే అంటారు. తల్లిదండ్రులు తన కోసం వరుడి వేటలో ఉన్న మాట నిజమేనన్నారు.
అయితే వారు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా? లేక తాను ప్రేమించిన వాడ్ని చేసుకోవాలా? అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఇంకా చెప్పాలంటే నటిగా పలు అవకాశాలు వస్తుండడంతో ఇప్పుడు పెళ్లి గురించే ఆలోచించడం లేదన్నారు.ఆమె వ్యవహారం అలా ఉంటే ఇంతకీ అనుష్క లవరెవరన్న విషయం గురించి పరిశ్రమ వర్గాలు ఆరా తీసే పనిలో పడ్డారు.

No comments:
Post a Comment